Share News

చెట్ల నరికివేతపై విచారణ

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:45 AM

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్ల నరికివేతపై ఆదివారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. హరితహారంలో భాగంగా గతంలో

చెట్ల నరికివేతపై విచారణ
చెట్లను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్ల నరికివేతపై ఆదివారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. హరితహారంలో భాగంగా గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చధనాన్ని పంచుతున్న చెట్ల నరికి వేతపై ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన’ హరిత సంహారం’ అనే కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఎఫ్‌ఎస్‌వో పద్మలత, బీట్‌ అధికారి తిరుపతినాయక్‌లు నరికి వేసిన చెట్లను పరిశీలించారు. చెట్లతోపాటు కొమ్మలను ఎందుకు తొలగించారని వివరాలను సేకరించారు. విద్యుత్‌ తీగల కింద ఉండడం, తరచూ కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బందితో నరికి వేయించారని గుర్తించారు. వాల్టా చట్టం ప్రకా రం చెట్లను నరికి వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీకి రూ.3 వేల జరిమానా విధించామని ఎఫ్‌ఎస్‌వో పద్మలత వివరించారు. మొక్కలను నాటి సంరక్షించాలని, అడ్డు తగులుతున్నాయనే కారణంతో చెట్లను నరికి వేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jun 08 , 2026 | 12:45 AM