చికెన్‌లో లివర్లు వేయడం లేదు సార్..!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:45 AM
మాకు చికెన్‌లో లివర్ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నారు సార్’.. అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు బుధవారం ...
ఎంపీడీవోకు హస్టల్ విద్యార్థుల ఫిర్యాదు
ఇనుగుర్తి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘మాకు చికెన్‌లో లివర్ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నారు సార్’.. అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు బుధవారం ఎంపీడీవో బండారు పార్థసారథికి చిత్రమైన ఫిర్యాదు చేశారు. తమకు చికెన్‌లో లివర్ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్టల్‌కు సంబంధించిన పలువురు విద్యార్థులు ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. మెనూ ప్రకారం సమయానికి భోజనం పెట్టించాలని అందులో పేర్కోన్నారు. దీంతో ఈ వింతైన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.