ట్రేడ్ యూనియన్ల హక్కులను కాలరాస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
ABN , Publish Date - May 19 , 2026 | 05:02 AM
వైద్య ఆరోగ్యశాఖలో ట్రేడ్ యూనియన్ల హక్కులను ఉన్నతాధికారులు కాలరాస్తున్నారని.. ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐఎన్ట్టీయూసీ 3194 రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు...
ఐఎన్ట్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ట్రేడ్ యూనియన్ల హక్కులను ఉన్నతాధికారులు కాలరాస్తున్నారని.. ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐఎన్ట్టీయూసీ 3194 రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి ఆరోపించారు. సోమవారం సంఘం సమావేశం అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్, జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది అందరూ వర్క్‌మెన్ కేటగిరి కింద ఇండస్ర్టియల్ డిస్ప్యూట్ చట్టం పరిధిలోకి వస్తారని అన్నారు. టీఎన్జీవో నాయకులు వైద్య ఆరోగ్య శాఖలోని పారామెడికల్ ఉద్యోగులకు జరిగే బదిలీలలో ప్రయారిటీ లెటర్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ గుర్తింపు సంఘమైన ఐఎన్‌టీయూసీ 3194కు బదిలీలలో ప్రయారిటీ ఇవ్వాలని, ప్రభుత్వం జీఏడీ నుంచి ఇచ్చిన ఉత్తర్వులలో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌లను భాగస్వామ్యం చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.