Share News

kumaram bheem asifabad- మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 10:37 PM

జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, శిక్షణ ఏఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారి అప్పయ్యలతో కలిసి తహసీల్దార్‌లు, అటవీ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో కంపెనీ, టి పైబర్‌ ప్రతినిధులతో సెల్‌ టవర్ల ఏర్పాటు, ఇంటర్నెట్‌ సౌకర్యాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, శిక్షణ ఏఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారి అప్పయ్యలతో కలిసి తహసీల్దార్‌లు, అటవీ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో కంపెనీ, టి పైబర్‌ ప్రతినిధులతో సెల్‌ టవర్ల ఏర్పాటు, ఇంటర్నెట్‌ సౌకర్యాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సెల్‌ టవర్ల నిర్మాణాలు, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సెల్‌ టవర్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు టవర్ల నిర్మాణాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పనపై అవసరమైన స్థలం గుర్తింపు, పాలన పరమైన అనుమతులు త్వరగా పొందాలని తెలిపారు. టవర్ల నిర్మాణాల ద్వారా మారు మూల గ్రామాలకు సెల్‌ సిగ్నల్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు, అటవీ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, ఎయిర్‌ టెల్‌, జియో, టిపైబర్‌ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

పండగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో రంజాన్‌ పండగ సందర్భంగా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి బార్గవ్‌కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి శాంతి కమిటీ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసంను ప్రజలు శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. మసీదుల వద్ద ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ప్రార్థన సమయం లో విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతరం సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మసీదుల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా పోలీసు శాఖ సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో మైనార్టీ సంక్షేమాధికారి నదీం, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉత్తం జాడే, తహసీల్దార్‌లు రియాజ్‌, మధుకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గజానన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 10:37 PM