వసతుల కల్పన అనంతరం ఇంటర్ విద్యను విలీనం చేయాలి
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:52 PM
వసతుల కల్పన అనంతరం ఇం టర్ విద్యను విలీనం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ పేర్కొ న్నారు. ఆదివారం మంచిర్యాల నగరంలోని డీటీఎఫ్ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సమావేశంలో మాట్లాడుతున్న సామ్యూల్
గర్మిళ్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వసతుల కల్పన అనంతరం ఇం టర్ విద్యను విలీనం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ పేర్కొ న్నారు. ఆదివారం మంచిర్యాల నగరంలోని డీటీఎఫ్ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్య లో విలీనం చేయడం వల్ల కొంత లాభదాయకంగా ఉన్నా కొన్ని అవాంత రా లు కూడా ఉన్నాయన్నారు. ఇలా చేయడం వల్ల స్థానికత సమస్య ఏర్పడు తుందన్నారు దీంతో స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ నిర్ణ యం కార్పోరేట్ సంస్థలకు మేలు చేసేలా ఉందన్నారు. అలాగే సరైన మౌ లిక సదుపాయాలు లేవని, అధ్యాపకులు లేరని, తొందరగా ప్రారంభించడం తో విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, జయకృష్ణ, కుమార్, ప్రకాష్, సురేష్, రమేష్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.