kumaram bheem asifabad- అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:28 PM
అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నితికా పంత్ కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. రెబ్బెన మండలం ఖైర్‌గాం గ్రామంలో ఈనెల 7న తాళం వేసి ఉన్న ఇంటిని ముందుగానే రెక్కి నిర్వహించి తాళం పగులగొట్టి ఇంటిలోని విలువైన వస్తువులను దొంగలించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో బాగంగా డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నితికా పంత్ కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. రెబ్బెన మండలం ఖైర్‌గాం గ్రామంలో ఈనెల 7న తాళం వేసి ఉన్న ఇంటిని ముందుగానే రెక్కి నిర్వహించి తాళం పగులగొట్టి ఇంటిలోని విలువైన వస్తువులను దొంగలించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో బాగంగా డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో బాగంగా గురువారం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన షిఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేశారని వివరించారు. అందులో తాళాలు పగులగొట్టెందుకు ఉపయోగించే సామగ్రితో పాటు బంగారు, వెండి అభరణాలు లభించాయన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన ఊపట్ల ప్రణయ్, మంచెర్ల సతీష్‌కుమార్, రాజేశం, సాలిగామ కృష్ణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా తాండూరు, ఖైర్‌గాం,జక్కులపల్లి, రెబ్బెన ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వారు అంగీకరించారని తెలిపారు. దీంతో నిందితుల నుంచి 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, నాలుగు మోబైల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, తాళాలు పగులగొట్టె సామగ్రిని స్వాధీనం చేసుకొవడం జరిగిందన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. కేసును ఛేధించిన డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్, పీసీలు నౌషాద్, వెంకటేష్‌లను ఎస్పీ అభినందించారు.