kumaram bheem asifabad- - రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:30 PM
ఇంటర్‌మీడియెట్ ప్రయోగ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ సిద్ధమైంది. సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిఘా నేత్రాల మద్య ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో గత ఏడాదే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- సిద్ధం చేస్తున్న అధికారులు
బెజ్జూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌మీడియెట్ ప్రయోగ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ సిద్ధమైంది. సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిఘా నేత్రాల మద్య ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో గత ఏడాదే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది ప్రయోగ పరీక్షల వేళ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికాకపోవడంతో బయట గదుల్లో నిర్వహించారు. అయితే ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గదుల్లోనే నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ పద్దతిలో జరుగుతున్నందున ప్రైవేటు కళాశాలలు కూడా ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కళాశాలలకు ప్రయోగాల కోసం రసాయనాలు, పరికరాల కొనుగోలు కోసం ప్రతి కళాశాలకు రూ. 50వేల చొప్పున నిధులు విడుదల చేసింది. ప్రాక్టిక ల్స్‌కు అవసరమైన ల్యాబ్ సామగ్రి కొనుగోలు లుకు నిధులు రావడంతో ఇబ్బందులు తొలగిపోయాయి.
- జిల్లాలో 48కళాశాలలు..
జిల్లా వ్యాప్తంగా 48జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 11ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాగా, 37ప్రభుత్వ సెక్టారులో పనిచేసే కళాశాలలు అంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు మొదలగునవి. ఐదు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 10,301మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,507, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,794మంది ఉన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,956కాగా జనరల్ విద్యార్థులు 7,345మంది ఉన్నా రు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 15కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయంతో సెకండీయర్‌లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డు ఇప్పటికే షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ప్రతిరోజు రెండు సెషన్లలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేటు కళాశాలలు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
- ఫిర్యాదుల ఫలితంగానే..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై కొన్నేళ్లుగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు విద్యార్థులు అసలు ప్రాక్టికల్స్ చేయకున్నా ర్యాంకులే లక్ష్యంగా కళాశాలల యాజమాన్యాలు మార్పులు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు కళాశాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. అవకతవకలను అడ్డుకునేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగానే సీసీ కెమెరాల మధ్య ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహంచేందుకు సిద్ధమైంది. అదేవిధంగా పరీక్షల తీరు ఏ కళాశాలలో ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు? అనే వివరాలతో ప్రతిరోజు నివేదిక అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం ప్రతి ల్యా బ్‌లో నాలుగు మెగా ఫిక్సెల్ సామర్థ్యం కలిగిన రెం డు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి వాయి స్, వీడియో రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంటుం ది. కెమెరాల పర్యవేక్షణ నేరుగా ఇంటర్ బోర్డు కమిష నర్ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో అక్రమాలు జరిగినా నేరుగా తెలిసే అవకాశం ఉంది.
పకడ్బందీగా ప్రయోగ పరీక్షలు..
- రాందాస్, డీఐఈవో ఆసిఫాబాద్
ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయోగ పరీక్షల కోసం జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొదటిసారిగా ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా పరీక్షలు పారదర్శకంగా జరిగే అవకాశాలుంటాయి. ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేసి వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉంటాం. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రయోగాల పరికరాల కొనుగోలు కు ప్రభుత్వం ఒక్కో కళాశాలకు రూ.50 వేలు విడు దల చేసింది.