Intermediate Exams: విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్ టికెట్లు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:20 AM
ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సా్‌పకు పంపిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.
హైదరాబాద్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సా్‌పకు పంపిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల హాల్ టికెట్లను వారి తల్లిదండ్రులకు పంపిస్తామని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పదోతరగతి హాల్ టికెట్ నెంబరు, పుట్టినతేదీ నమోదు చేసి ఫస్టియర్ విద్యార్థుల హాల్‌టికెట్లు చూడవచ్చని, ఫస్టియర్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి సెకండియర్ విద్యార్థుల హాల్‌టికెట్ చూడవచ్చన్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో తప్పిన సబ్జెక్టులు, మార్కుల వివరాలను కూడా సెకండియర్ హాల్‌టికెట్‌లో నమోదు చేస్తున్నామన్నారు. దీంతో తల్లిదండ్రులకు అవగాహన ఉంటుందన్నారు. హాల్ టికెట్‌లో ఏమైనా మార్పులుంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సవరించుకోవాలని కృష్ణ ఆదిత్య తల్లిదండ్రులను కోరారు.