Share News

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:52 PM

జిల్లాలో జరు గుతున్న ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజీ, వేంపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

హాజీపూర్‌/మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరు గుతున్న ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజీ, వేంపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16 వరకు ఉదయం 9 గంట ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీ క్షల నిర్వహణకు 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్లైయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించామన్నారు. పరీక్ష కేంద్రా ల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ అధికారులు పరీక్ష లకు అనుగుణంగా బస్సులను నడిపించాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులను ఉంచాలన్నారు. ఆ యన వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి అంజయ్య, హాజీపూర్‌ త హసీల్దార్‌ శ్రీనివాస్‌రావుదేశ్‌పాండే ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:52 PM