kumaram bheem asifabad- నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:41 PM
జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించే ఇంటర్మీడి యట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కూడ ప్రత్యేకంగా విద్యార్థుల సౌకర్యార్థం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
- జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు
- హాజరుకానున్న 9,716 మంది విద్యార్థులు
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించే ఇంటర్మీడి యట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కూడ ప్రత్యేకంగా విద్యార్థుల సౌకర్యార్థం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం 9,716 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిర్ణీత సమయానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నా రు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే అనుమతి లేదు. పరీక్షల సమ యంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
మార్చి 16వ తేదీ వరకు..
జిల్లాలో బుధవారం నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. దీనిలో బాగంగా మార్చి 13వ తేదీ వరకు జనరల్ విద్యార్థు లకు, 16వ తేది వరకు ఒకేషనల్ విద్యా ర్థులకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో 9.716 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనిలో మొదటి సంవత్సరం 5,025 మంది, ద్వితీయ సంవత్సరం 4,691 మంది ఉన్నారు. కాగా హాల్ టికెట్లపై కూడా నూతనం గా క్యూఆర్ కోడ్ ఇచ్చిన అధికారులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సెంటర్ లోకేషన్ తెలిసే విధంగా ఏర్పాటు చేశా రు. దీంతో విద్యార్థులు తమ ఉన్న ప్రాంతాల నుంచి సెంటర్‌కు ఎంత దూరంలో ఉన్నామనే విషయాన్ని కూడా తెలుసుకునే వెసులు బాటు కలుగుతుంది.
- సంక్షిప్త సందేశాలతో..
గత సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు నూతనం గా తీసుకువచ్చిన విద్యార్థులకు నేరుగా సంక్షిప్త సందేశాల ను ప్రస్తుత సంవత్సరం కూడ కొనసాగిం చింది. సంక్షిప్త సందేశాలు పంపిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ పేరుతో శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌కు లింక్ పంపించి డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని గత సంవత్సరం అమ ల్లోకి తీసుకువచ్చారు. దీన్ని ప్రస్తుత సంవత్సరం విజయవంతంగా పూర్తి చేశారు. విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడి తగ్గించడంతో పాటు వారు పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధ అయ్యే విధంగా పరీక్షలు అంటే భయపడే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక నంబర్ కేటాయించారు. దీంతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు విద్యార్థుల్లో నూతన ఉత్తే జాన్ని నింపే ప్రయత్నం చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
- రాందాస్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాదికారి
జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అయా పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, తగినంత వెలుతురు కోసం లైట్లు, డ్యుయల్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు, ఇంటర్‌నెట్ సౌకర్యం ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలి.