Share News

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:40 AM

రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 25న ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి దాదాపు 9.8లక్షల మంది హాజరయ్యారు

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 25న ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి దాదాపు 9.8లక్షల మంది హాజరయ్యారు. చివరిరోజున ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్షతో ఈ ప్రక్రియ పూర్తయింది. పరీక్షల నిర్వహణ కోసం బోర్డు అధికారులు మొత్తం 10,426 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇంటర్‌ బోర్డులోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వీటిని అనుసంధానించడం ద్వారా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణతో ఈ ఏడాది మాల్‌ప్రాక్టీస్‌ కేసులు గణనీయంగా తగ్గాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన అధికారులకు ఆయన అభినందించారు. ఇంటర్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కర్ణాటక, పంజాబ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ ఉన్నతాఽధికారులు శుక్రవారం సందర్శించారు. సాంకేతికతను ఉపయోగించి పరీక్షలను ఎలా పర్యవేక్షిస్తున్నారో బోర్డు కార్యదర్శి వారికి వివరించారు.

Updated Date - Mar 14 , 2026 | 05:40 AM