kumaram bheem asifabad- ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:44 PM
ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా న్విహించానలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పీలు, విద్యాశాఖాధికారులు, వైద్య శాఖాధికారులు, ఆర్టీసీ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కార్యదర్శులు, కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా న్విహించానలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పీలు, విద్యాశాఖాధికారులు, వైద్య శాఖాధికారులు, ఆర్టీసీ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కార్యదర్శులు, కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఉంటాయని చెప్పారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉంటాయని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీరు, పారిశుధ్యం, వెలుతురు, సరిపడ ఫర్నిచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు, పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రశ్న, జవాబు పత్రాలను పోలీసు బందో బస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించాలన్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంలో వీడియో కాన్ఫరెన్స్ హభాల్‌లో నిర్వహించిన వీసీలో కలెక్టర్ హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు 19 కేంద్రాలు, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు 38 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలను పకడ్బంధీగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రాందాస్, డీపీఓ భిక్షపతి, జిల్లా రవాణ శాఖాధికారి రాంచందర్, ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.