గేమ్ చేంజర్‌గా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: భట్టి
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:49 AM
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు గేమ్ చేంజర్‌గా మారనున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు గేమ్ చేంజర్‌గా మారనున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలతో భట్టి మాట్లాడుతూ.. సమీకృత గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం కూడా దేశానికే ఆదర్శం కాబోతుందన్నారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రతినిధులు గండు యాదగిరి, షేక్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్తు సంస్థల్లో 1999 నుంచి 2004 దాకా నియమితులైన వారందరికీ పాత పెన్షన్ విధానం (జీపీఎఫ్) వర్తింపచేయాలంటూ భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జీపీఎఫ్ సాధన సమితి కోరింది. ఈ మేరకు వారిని సంఘం చైర్మన్ బి.మంగీలాల్ నేతృత్వంలో ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భట్టి హామీనిచ్చినట్లు వారు తెలిపారు.