Share News

సరుకు తడిసినా పరిహారం ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:23 AM

రవాణా సమయంలో వర్షంవల్ల జరిగిన నష్టానికి బీమా సంస్థ బాధ్యత వహించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. బేగంపేటకు చెందిన.....

సరుకు తడిసినా పరిహారం ఇవ్వాల్సిందే

హైదరాబాద్‌ సిటీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రవాణా సమయంలో వర్షంవల్ల జరిగిన నష్టానికి బీమా సంస్థ బాధ్యత వహించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. బేగంపేటకు చెందిన జేకే ఆగ్రి జెనెటిక్స్‌ లిమిటెడ్‌ విత్తనాలను ఇండోర్‌కు సరఫరా చేస్తోంది. 2015లో రవాణా సమయంలో లారీల్లో ఉన్న విత్తనాలు వర్షానికి తడిసి మొలకెత్తడంతో నష్టం వాటిల్లింది. బీమా సంస్థ(ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌) స్పందించకపోవడంతో సంస్థ నిర్వాహకులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. జరిగిన నష్టం రూ.26.76 లక్షలకు 12 శాతం వడ్డీ, రూ.2లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు 30 రోజుల్లో చెల్లించాలని ఫోరం గురువారం తీర్పునిచ్చింది.

Updated Date - Mar 06 , 2026 | 03:50 AM