Quick Commerce: క్విక్ కామర్స్‌లో 5 వేల ఉద్యోగాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:25 AM
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉద్యోగాలకు నైపుణ్యాలు అందించే...
ఇన్‌స్టామార్ట్-స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందం
హైదరాబాద్, జనవరి6(ఆంధ్రజ్యోతి): క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉద్యోగాలకు నైపుణ్యాలు అందించే ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీశ్ మీనన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా 5వేల మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తారు. క్విక్ కామర్స్ రంగంలో కీలకమైన డార్క్ స్టోర్ ఆపరేషన్లు, సరఫరా గొలుసు నిర్వహణ, కస్టమర్ సర్వీస్, సేవాస్థాయి ఆధారిత ేసవల అందజేత, అలాగే రిటైల్ లాజిస్టిక్స్‌లో ఉద్భవిస్తున్న కొత్త ధోరణులపై శిక్షణ ఇస్తారు. అనంతరం స్టోర్ మేనేజర్ ట్రెయినీ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారు.