Share News

kumaram bheem asifabad- పాఠశాలను తనిఖీ చేసి.. పరిసరాలు పరిశీలించి..

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 PM

మండలంలోని చిన్నరాస్పెల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్‌ పాఠశాలను కలెక్టర్‌ హరిత శనివారం తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, టాయిటెట్లు, రక్షిత మంచినీటి వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ

kumaram bheem asifabad- పాఠశాలను తనిఖీ చేసి.. పరిసరాలు పరిశీలించి..
విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కె.హరిత

దహెగాం, ఆగస్టు 29 (ఆంద్రజ్యోతి): మండలంలోని చిన్నరాస్పెల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్‌ పాఠశాలను కలెక్టర్‌ హరిత శనివారం తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, టాయిటెట్లు, రక్షిత మంచినీటి వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరు వంద శాతం బడికి వచ్చేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా చూడాలన్నారు. బడుల్లో అవసరమైన మౌలిక వసతులను వేగంగా కల్పిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపించి ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ బడులకే పంపించేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భూ సర్వే పనుల పరిశీలన

మండలంలోని అమర్‌గొండ గ్రామంలో శరవేగంగా జరుగుతున్న భూ సర్వే పనులను జిల్లా కలెక్టర్‌ కె.హరిత శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామ పొలిమేర సరిహద్దులు, ఆవాస ప్రాంతాల సరిహద్దులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భూములను స్వయంగా తనిఖీ చేశారు. సర్వే పురోగతిపై అధికారులకు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో భూ సరిహద్దుల కచ్చితమైన నిర్ధారణ, రికార్డుల సమగ్ర పరిశీలన, రైతుల భాగస్వామ్యం అంత్యంత కీలకమని తెలిపారు. కార్యక్రమంలో రికార్డుల సహాయ క సంచాలకులు వినయ్‌కుమార్‌, డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే రామేశ్వర్‌, మండల సర్వేయర్‌ ధన్‌రాజ్‌, సంబంధిత రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:50 PM