Share News

kumaram bheem asifabad- ఎన్నికల సామగ్రి పరిశీలించి.. సూచనలు చేసి

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:28 PM

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలను గురువారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న పోలింగ్‌ జరుగనుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

kumaram bheem asifabad- ఎన్నికల సామగ్రి పరిశీలించి.. సూచనలు చేసి
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలను గురువారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న పోలింగ్‌ జరుగనుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగునీరు, నీడ, విద్యుత్‌ సరఫరా, కనీస వసతులు కల్పించాలని తెలిపారు. పంపిణీ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్ని కలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను స్వయంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రిపరేషన్‌ స్థాయిని పరీక్షించారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్ట పడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. వారికి అర్థమయ్యే రీతిలో బోధన ఉండాలని సూచించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, ఎంఈవో తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 10:37 PM