Share News

ఎల్లూరులో ఉపాధ్యాయుల బడిబాట వినూత్నం

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:29 PM

ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యార్థుల నమోదు ను పెంచడమే లక్ష్యంగా చేప ట్టిన జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు ప్రాథమి క పాఠశాల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చు ట్టారు.

ఎల్లూరులో ఉపాధ్యాయుల బడిబాట వినూత్నం
బడిబాటలో భాగంగా ఎల్లూరు గుడిగట్టు వద్ద ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఎంఈవో ఇమ్మానుయేల్‌, ఉపాధ్యాయులు

కొల్లాపూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యార్థుల నమోదు ను పెంచడమే లక్ష్యంగా చేప ట్టిన జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు ప్రాథమి క పాఠశాల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చు ట్టారు. ఎల్లూరు గుడిగట్టు సమీపంలోని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్ద కు వెళ్లిన ఉపాధ్యాయులు, అ క్కడ 130 మంది విద్యార్థుల త ల్లిదండ్రులను కొద్దిసేపు కూర్చో బెట్టి మాట్లాడారు. ఎంఈవో ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల బయటి ఆ ర్భాటాలను చూసి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యను అం దించే నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని తెలుపుతూ, విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆప్యా యతతో బోధిస్తారని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠ శాలలకే పంపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ శశికళ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ వంగూరు, (ఆంధ్రజ్యోతి) : మండలం లోని తుమ్మలపల్లి గ్రామంలో బడిబాట కార్య క్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటిం టికీ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సౌకర్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో లింగమయ్య, హెచ్‌ఎం సైదులు, కోటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

గౌరారం సర్పంచ్‌ ఆదర్శం

తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండల పరిధి లోని గౌరారం గ్రామంలో నిర్వహించిన బడిబా ట కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బిరుదు మల్లీశ్వరి ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న తమ ఇద్దరు పిల్లలను తమ గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేర్పించి గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలించారు. 5వ తరగతిలో మోక్ష, 3వ తరగతిలో రిషికేస్‌ను చర్పించారు. ప్రాధానోపాధ్యాయుడు విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గురువారం మరో ఆరుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. మా పై నమ్మ కంతో పాఠశాలలో పిల్లలను చేర్చిన తల్లిదం డ్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం, ఉపాధ్యాయు లు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకు లు ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్‌ శీవలీల, రజిత, అలివేలు పాల్గొన్నారు.

ఫ అమ్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని బీకే ఉప్పునుంతల, బీకే తిర్మలాపూర్‌, అమ్రాబాద్‌ తదితర గ్రామాల్లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం కోసం గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాల ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారంలో పా ల్గొన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు బాలకిషన్‌, ఉపాధ్యాయులు, గ్రామస్థు లు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:29 PM