Share News

kumaram bheem asifabad-ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:43 PM

ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చొరవ చూపాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు సిర్పూర్‌(యు), జైనూర్‌, లింగాపూర్‌ మండలాల రాయ్‌ సెంటర్‌ సార్మెడిలు, నాయకులు వినతిపత్రం అందజేశారు.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాధ్‌రావు, మూడు మండలాల రాయ్‌ సంటర్‌ సార్మెడిలు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

kumaram bheem asifabad-ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

సిర్పూర్‌(యు), ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చొరవ చూపాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు సిర్పూర్‌(యు), జైనూర్‌, లింగాపూర్‌ మండలాల రాయ్‌ సెంటర్‌ సార్మెడిలు, నాయకులు వినతిపత్రం అందజేశారు.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాధ్‌రావు, మూడు మండలాల రాయ్‌ సంటర్‌ సార్మెడిలు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల్ల జరిగిన ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో తీర్మానించిన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించాలని కోరారు. జైనూర్‌ సంఘటనలో ఆదివాసీలపై నమోదైన కేసులను ఎత్తివేయలని కోరారు. అదే విధంగా ఏజెన్సీ డీఎస్‌స్సీ నిర్వహించి ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. జీవోఎంఎస్‌ 109 ప్రకారం పోలీస్‌ ఉద్యోగలలో 75 శాతం స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు. సాగు చేస్తున్న పోడు భూములకు పట్టలు అందించాలన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.. కార్యక్రమంలో రాయ్‌ సెంటర్‌ సార్‌మెడీలు గేడం గణపత్‌రావు, ఆత్రం ఆనంద్‌రావు, మెస్రం బాదిపటేల్‌, ఆత్రం మక్తుర్‌షా, ఆదివాసీ నాయకులు కోడప హన్నుపటేల్‌, మనోహర్‌, పెందోర్‌ గణపత్‌రావు, మెస్రం అంబాజీ, కుమ్ర శ్యాంరావు, గేడం గోపిచంద్‌, మెస్రం శేకు, ఆత్రం ఆనంద్‌రావు, మెస్రం నాగోరావు, పెందోర్‌ ప్రకాష్‌, మెస్రం భూపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:43 PM