Share News

kumaram bheem asifabad- వారసంత..సమస్యల చింత

ABN , Publish Date - Jun 07 , 2026 | 10:15 PM

జిల్లాలోని గ్రామీణ ప్రజలు వివిధ అవసరా ల కోసం నిత్యావసరాలు, కూరగాయలు ఇతర వస్తువుల కొనుగోళ్లు వంటివి వార సంతలపై ఆధారపడుతుంటారు. ప్రధానంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో మండ లంలోని ప్రతీ వారం నిర్వహించే వార సంతలో కనీస సౌకర్యాలు లేక సంతకు వచ్చే వినియోగ దారులకు, వ్యాపారులకు మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు

kumaram bheem asifabad- వారసంత..సమస్యల చింత
సిర్పూరు(టి)లో నేలపైనే కూర్చుని విక్రయిస్తున్న వ్యాపారులు

- పట్టించుకోని అధికారులు

సిర్పూర్‌(టి), జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రజలు వివిధ అవసరా ల కోసం నిత్యావసరాలు, కూరగాయలు ఇతర వస్తువుల కొనుగోళ్లు వంటివి వార సంతలపై ఆధారపడుతుంటారు. ప్రధానంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో మండ లంలోని ప్రతీ వారం నిర్వహించే వార సంతలో కనీస సౌకర్యాలు లేక సంతకు వచ్చే వినియోగ దారులకు, వ్యాపారులకు మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ వారసంతల్లో భారీగా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏటా లక్షల్లోనే ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అంతకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం లక్షల ఆదాయం వస్తున్నా, సంబంధిత అధికారులు ఈ సంత లో ఎలాంటి వసతులు కల్పించపోవడం పట్ల జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారసంతల్లో కనీససౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు కోరుతు న్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండల కేంద్రాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. పలు మేజర్‌ పంచాయతీల్లోనూ వారసంతలు కొనసాగిస్తున్నారు.

ఆదాయం సమకూరుతున్నా..

సంత నిర్వహణకు పంచాయతీలకు రూ. లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రవుఖ పాత్ర పోషించే సంత నిర్వహణకు స్థలాలు లేక రోడ్లపైనే క్రయ విక్ర యాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొర వడి పలు సంత స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. మరి కొన్ని చోట్ల రోడ్లపై సంతలు నిర్వహిస్తున్నా రు. దీంతో వారసంత రోజు ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. సిర్పూరు(టి) మండల కేంద్రంతో పాటు పది గ్రామ పంచాయతీల ప్రజలు వారంత సంతకు వచ్చి వివిధ సరుకులను కొనుగోలు చేసుకుంటారు. ఏటా వేలం పాటల్లో లక్షల్లో ఆదాయం ఉన్నప్పటికీ కూడా వసతులు కల్పనలో అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. సంతలో ఏళ్ల తరబడి పబ్లిక్‌ టాయిలెట్స్‌ కోసం గతంలో పలుమార్లు వినతిపత్రాలు అందజేయగా, ఎట్టకేలకు పబ్లిక్‌ కోసం టాయిలెట్‌ గదులను ఏర్పాటు ఏర్పాటు చేశారు. మిగితా విషయంలో ఇంకా పరిష్కారం కావడం లేదు. వ్యాపారులు అమ్ముకునేందుకు సరైన షెడ్లు కూడా లేక పోవడంతో ప్రస్తుతం మండుతున్న నేలపైనే కూర్చుని ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది వచ్చే సంతలో కనీసం తాగునీటి వసతి లేని పరిస్థితి దాపురించింది. సంత ముగిసిన తర్వాత చెత్తను ఎప్పటికప్పుడు తొలగించక పోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా దుర్గంధం వెదజల్లుతోంది. సంత ఆవరణలో పక్కాగా సీసీ కాంక్రిట్‌ రేకుల షెడ్లు వేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే పార్కింగ్‌కు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సిర్పూరు(టి) ఈవో బి తిరుపతిని వివరణ కోరగా వారంత సంతలో వివిధ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని చెప్పారు. మిగితా అభివృద్ధి పనుల విషయంలో కూడా తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించామని వివరించారు.

Updated Date - Jun 07 , 2026 | 10:15 PM