kumaram bheem asifabad- వారసంత.. వసతుల్లేక చింత..
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:46 PM
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సంతల పైనే ఆధారపడుతూ తమకు కావాల్సిన సరకులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ వారం నిర్వహించే సంతల్లో లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. వీటి ద్వా రా ఆదాయం గ్రామ పంచాయతీలకు సమకూరుతున్నా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. షెడ్లు లేక పోవడంతో వ్యాపారులు పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేసుకోని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
జైనూర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సంతల పైనే ఆధారపడుతూ తమకు కావాల్సిన సరకులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ వారం నిర్వహించే సంతల్లో లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. వీటి ద్వా రా ఆదాయం గ్రామ పంచాయతీలకు సమకూరుతున్నా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. షెడ్లు లేక పోవడంతో వ్యాపారులు పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేసుకోని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఎక్కడా లేవు. ఫలితంగా వానాకాలంలో చాల వరకు వారసంతలు నిర్వహిస్తున్న స్థలాలు బురదమయం అవుతుండడంతో ఆవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి 50 నుంచి 100 వసూలు చేస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మండల కేంద్రంలో ప్రతీ గురువారం సంత కొనసాగుతోంది. మండలంలోని లొద్దిగూడ, అడ్డెసర్, తాడి గూడ తదితర గ్రామాల ప్రజలకు రహదారి సదుపాయం లేక పోవడంతో వర్షాకాలంలో వారికి తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. జైనూర్ మండల కేంద్రంలో వార సంత అసౌకర్యాల మధ్య కొనసాగుతోంది. షెడ్లు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సంతకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.