Share News

kumaram bheem asifabad-సమస్యల్లో వారసంతలు

ABN , Publish Date - May 26 , 2026 | 10:29 PM

మారుమూల గ్రామాల్లో సూపర్‌మార్కెట్ల తరహాలో వారసంతలు కొనసాగుతున్నాయి. వారసంతల్లో నిత్యావసర సామగ్రి మొదలుకొని అన్ని రకాల సామాగ్రి లభ్యం అవుతాయి. చిన్న పిల్లల ఆట వస్తువులు, మహిళల కాస్మోటిక్స్‌, దుస్తులు, వంట పాత్రలు తదితర సామాగ్రి అందుబాటులో ఉంటాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి), దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. ఇది వరకు బాగానే ఉన్నా వారసంతల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి.

kumaram bheem asifabad-సమస్యల్లో వారసంతలు
లోగో

- నేలపైనే కూర్చొని విక్రయాలు

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లో సూపర్‌మార్కెట్ల తరహాలో వారసంతలు కొనసాగుతున్నాయి. వారసంతల్లో నిత్యావసర సామగ్రి మొదలుకొని అన్ని రకాల సామాగ్రి లభ్యం అవుతాయి. చిన్న పిల్లల ఆట వస్తువులు, మహిళల కాస్మోటిక్స్‌, దుస్తులు, వంట పాత్రలు తదితర సామాగ్రి అందుబాటులో ఉంటాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి), దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. ఇది వరకు బాగానే ఉన్నా వారసంతల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల వస్తు సామాగ్రి ఒకే చోట దొరుకుతుందంటే కేవలం వారసంతల్లోనే అని చెప్పవచ్చు. పల్లెల్లో వారసంతలకున్న క్రేజ్‌ పట్టణాల్లో కనిపించదు. మరికొద్ది రోజుల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో సంతల్లో సౌకర్యాలు కల్పించేందుకు ఇదే అనువైన సమయం కావడంతో ఆ దిశగా సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు.

- సమస్యలతో సతమతం..

గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న వారసంతలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో క్రయవిక్రయదారులు అనేక అవస్థలు పడుతున్నారు. సంతల్లో వ్యాపారులు కూర్చోడానికి గద్దెలు లేకపోవడంతో నేలపైనే కూర్చొని విక్రయాలు జరుపుతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వర్షంలోనే సామాగ్రి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. గద్దెలు, షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కోసారి బురదలోనే కూర్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మిగితా కాలాల్లో వస్తు సామాగ్రిపై దుమ్ము, దూలి పడి సామాగ్రి పూర్తిగా చెడిపోతుందని వ్యా పారులు ఆందోళన చెందుతున్నారు. అయినా గ్రామ పంచాయతీల్లో అధికారులు సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

- ఆదాయం ఉన్నా..

ఆయా మండలాల పరిధిలో వారంలో ఒక్క రోజు వారసంతలు కొనసాగుతున్నాయి. వారసంతల ద్వారా గ్రామపంచాయతీకి లక్షల ఆదాయం సమకూరుతున్నాయి. గ్రామపంచాయతీలకు ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నియోజకవర్గంలోని కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల్లో పెద్ద మొత్తంలో వారసంతల నిర్వహణ కొనసాగుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు జైనూరు, కెరమెరి, వాంకిడి, సిర్పూర్‌(యు) వంటి మండలాల్లోనూ పెద్ద మొత్తంలో వారసంతలు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో నిర్వహించే సంతల్లో ఒక్కో ప్రాంతంలో సుమారు రూ. 10లక్షల వరకు ఆదాయం వస్తోంది. అయినా సౌకర్యాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారసంతల్లో ప్రతి వారం వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నా ఏ మాత్రం సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో నిర్వహించే వారసంతల్లో చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పట్టణాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఇలా పల్లెల్లో ఎన్నో దశాబ్దాలుగా వారసంతలు కొనసాగుతున్నా నాటి నుంచి సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సౌకర్యాలు ఏర్పాటు చేయాలి..

- గోరెంటల తేజస్విని, వ్యాపారి, బెజ్జూరు

వారసంతల్లో అధికారులు సౌకర్యాలు కల్పించాలి. గత కొద్ధేళ్లుగా వారసంతల్లో విక్రయాలు జరిపి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అయితే గ్రామాల్లో నిర్వహించే సంతల్లో ఎలాంటి సదుపాయాలు లేవు. దీందో నేలపైనే కూర్చొని విక్రయాలు జరుపుతున్నాం. వర్షం వచ్చిన సమయంలో బురదలోనే విక్రయించాల్సి వస్తోంది.

Updated Date - May 26 , 2026 | 10:29 PM