మంచిర్యాల కాంగ్రెస్‌లో లొల్లి...
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:22 PM
మంచిర్యాల నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరు రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావుకు, ఆయన ప్రధాన అనుచరుడు మంతెన జగన్‌మోహన్‌రావుకు మధ్య కొంతకాలంగా నె లకొన్న వివాదం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది.
====================
ఎమ్మెల్యే పీఎస్సార్ అనుచరుడు ‘మంతెన’ వేరు కుంపటి
-మంత్రి అండతో నియోజకవర్గంలో దూకుడు
-జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
మంచిర్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరు రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావుకు, ఆయన ప్రధాన అనుచరుడు మంతెన జగన్‌మోహన్‌రావుకు మధ్య కొంతకాలంగా నె లకొన్న వివాదం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఎమ్మె ల్యేకు అత్యంత సన్నిహితుడిలా మెదిలిన జగన్ ప్రస్తు తం వేరు కుంపటి పెట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎ న్నికల నుంచి ప్రేంసాగర్‌రావు వెన్నంటే ఉన్న జగన్ ని న్నటి మునిసిపల్ ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా త నదైన పాత్ర పోషించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొద్దినెలల క్రితం ఇరువురి మధ్య ఏర్ప డ్డ మనస్పర్థల కారణంగా జగన్‌ను ఎమ్మెల్యే పీఎస్సార్ పక్కన పెట్టారు. అప్పటి నుంచి ఎవరి దారిలో వారు పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంచి ర్యాల ఎమ్మెల్యేతో తమకున్న విబేధాల కారణంగా చె న్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ గ డ్డం వంశీకృష్ణ దీనిని అవకాశంగా తీసుకుని జగన్‌ను త మ గూటికి ఆహ్వానించారు. విషయాన్ని ఎంపీ వంశీకృ ష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జగన్ మంత్రితో చాలా రోజులుగా టచ్‌లో ఉ న్నారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతుండగా, వివే కానందతో కలిసి హైద్రాబాద్‌లో జరిగిన సీఎం సమావే శంలో వేదికను పంచుకోవడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఈనెల 20న జగ న్ ఆవిష్కరించడంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. మరోవైపు విగ్రహావి ష్కరణలో జగన్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ రావుల ఉప్పలయ్య, 36వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాణి భర్త అగల్ డ్యూటీ రాజులు ఉండటం గమనార్హం.
పీఎస్సార్ అండదండలతోనే....
మంత్రి వివేకానంద గూటికి చేరిన జగన్ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అండదండలతోనే రాజకీయంగా ఎదిగా రు. అంతకు ముందు బీఆర్‌ఎస్ నాయకులతో పరిచ యాలు ఉన్న జగన్, ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికై న తరువాత ఓ వెలుగు వెలిగారు. జగన్ సూచన మేరకే మునిసిపల్ ఎన్నికల్లో అనేక మందికి పీఎస్సార్ టికెట్లు ఇచ్చారన్న ప్రచారం సైతం ఉంది. ఇరువురి మ ధ్య నెలకొన్న వివాదం కారణంగా జగన్ మంత్రి పక్షాన చేరగా, మంచిర్యాల నియోజకవర్గంలో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న వలసలు....
జగన్ ప్రోత్సాహంతో నియోజక వర్గంలోని పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ వర్గంలోకి వలస వెళుతున్నారు. కార్పొ రే టర్లు వర్గం మారునున్నారని తెలిసి, ఇటీవల పీఎస్సార్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తామంతా ఎమ్మెల్యేతోనే ఉంటామని కాంగ్రెస్ కార్పొరే టర్లంతా అప్పుడు మూకుమ్మడిగా ప్రకటించారు. అయి తే వారం రోజుల్లోనే కార్పొరేటర్లు పీఎస్సార్‌ను వీడటం గమనార్హం. గడిచిన రెండు రోజుల్లో మునిసిపల్ కార్పొరే షన్‌కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లు, లక్షెట్టిపేట ము నిసిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, దండేపల్లి మండలం నుంచి కూడా పలువురు నాయకులు మంత్రి వర్గంలో చేరారు. ఇప్పటి వరకు వర్గం మారిన కాంగ్రెస్ కార్పొరే టర్లలో 47వ డివిజన్ కార్పొరేటర్ వెంకటసాయి కృష్ణ, 36వ డివిజన్ కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాణి, 27వ డివిజన్ కార్పొరేటర్ ఇరగదిండ్ల రవి, 5వ డివిజన్ కా ర్పొరేటర్ బత్తుల సరిత, 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల అశ్విని, 8వ డివిజన్ కార్పొరేటర్ అట్కాపురం సతీష్, 48వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి లక్ష్మీదుర్గ కుమా రుడు సంజీవ్ ఉన్నారు. అయితే మొత్తం 20 మంది కా ర్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా భవిష్యత్తు లో నియోజకవర్గంలో పట్టు సాధించాలనే లక్ష్యంతో జగ న్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.