Share News

kumaram bheem asifabad- నాసిరకం విత్తు.. నమ్మితే చిత్తు..

ABN , Publish Date - Apr 25 , 2026 | 10:51 PM

జిల్లాలో గత కొన్నేళ్లుగా నాసిరకం విత్తనాల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దాన్ని అరికట్టే చర్యలు లేని కారణంగా నాసిరకం విత్తన మాఫియా చెల రేగిపోతోంది. దీంతో రైతులు వారు చెప్పే మాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు. రైతుల అమా యకత్వాన్ని ఆసరా చేసుకొన్న సీడ్‌ మాఫియా వారికి నాసిరకం విత్తనాలు అంటగట్టి లక్షలు గడిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారన్న చందంగా విత్తన మాఫియాపై అధికారులు చర్యలు చేపడుతున్నా కేవలం దాడులకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలున్నాయి.

kumaram bheem asifabad- నాసిరకం విత్తు.. నమ్మితే చిత్తు..
లోగో

- ఏటా సీజన్‌లో ఇదే తంతు

- అప్రమత్తంగా లేకపోతే మళ్లీ అదే పరిస్థితే

బెజ్జూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత కొన్నేళ్లుగా నాసిరకం విత్తనాల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దాన్ని అరికట్టే చర్యలు లేని కారణంగా నాసిరకం విత్తన మాఫియా చెల రేగిపోతోంది. దీంతో రైతులు వారు చెప్పే మాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు. రైతుల అమా యకత్వాన్ని ఆసరా చేసుకొన్న సీడ్‌ మాఫియా వారికి నాసిరకం విత్తనాలు అంటగట్టి లక్షలు గడిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారన్న చందంగా విత్తన మాఫియాపై అధికారులు చర్యలు చేపడుతున్నా కేవలం దాడులకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఫెయిల్యూర్‌, నకిలీ, నాణ్యత లేని విత్తనాలకు సంబంధించి తయారీదారులు, అమ్మకందారులు, రవాణాదారులపై కేవలం చీటింగ్‌ కేసులతోనే సరి పెడుతుండటంతో దళారులు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో నాసిరకం పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి లక్షలు అర్జిస్తున్నారు. నాసిరకం పత్తి విత్తనాలు సరపరా చేసే వ్యక్తులపై మామూ లు కేసులే నమోదు చేస్తుండడంతో అక్రమార్కులు ఒక్కరోజులోనే బెయిల్‌పై యథేచ్చగా తిరుగుతూ యథావిధిగా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి ఏటేటా రైతాంగాన్ని నట్టేటా ముంచుతున్న నాసిరకం విత్తనాల పీడ, సీడ్‌ ఆర్గనైజర్ల దోపిడీ ఇకనైనా ఆగేనా అన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.

- మరో నెల గడిస్తే..

మరో నెల గడిస్తే వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతుంది. ఇదే అదునుగా భావించి అక్ర మార్కులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నాసిరకం విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు. జిల్లాలో గత కొన్నేళ్లుగా అక్రమార్కులకు నాసిరకం పత్తి విత్తనాల దందా వారికి వరంగా మారుతోంది. పొరుగు రాష్ర్టానికి చెందిన వ్యాపారులు ఇక్కడి వారితో లావాదేవీలు కొనసాగిస్తూ నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. ఏటా ఏప్రిల్‌, మే మాసాల్లోనే విత్తనాలను ఈ ప్రాంతానికి చేర్చి నిల్వలు పెడుతున్నారు. అక్రమార్కులకు ఇక్కడి వారి అండదండలు పుష్కలంగా ఉండడంతో వారు ఆడిందే ఇట పాడిందే పాటగా కొనసాగుతోంది. ఆంద్రా ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యవసాయం పేరుతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూములను కౌలుకు తీసుకొని ఇక్కడే ఉంటూ నాసిరకం విత్తనాలను సరపరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా నాసిరకం పత్తి విత్తనాలను నాటిన రైతులు నట్టేటా మునగడంతో పాటు భూముల భూసారం కోల్పోతున్నారు. నాసిరకం విత్తనాలు నాటడం మూలంగా ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నాయి.

- అక్రమార్కులు పట్టుబడినా..

జిల్లా వ్యాప్తంగా జరిపిన పోలీసుల దాడుల్లో అనేక మంది అక్రమార్కులు పట్టుబడినా నకిలీ మాఫియా మాత్రం ఆగడం లేదు. టాస్క్‌ఫోర్స్‌, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడు లు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. కొంత మంది అక్రమార్కులు పోలీసులు దాడులు చేస్తారని భావించి పొరుగున ఉన్న మహారాష్ట్రలో నిల్వ లు పెడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్ని దాడులు నిర్వహించినా వారి వ్యాపారం మాత్రం ఆగడం లేదు. నాసిరకం విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. కల్తీ విత్తన ముఠాలతో అధికారులు కుమ్మక్కైనట్లు తేలితే ఉపేక్షించొద్దు అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేసినా కల్తీ మాఫియా మాత్రం ఆగలేదు. నాసిరకం విత్తనాలపై కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి మాఫియాపై ఉక్కుపా దం మోపాలని చెప్పినా అక్రమార్కులు మాత్రం వారి వ్యాపారాన్ని వీడడం లేదు. నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న మాపియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అధికారులే వారికి వంతు పాడుతున్నా రన్న విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందన్న అభిప్రాయాలున్నాయి.

- సరిహద్దులపై నిఘా అవసరం..

జిల్లాకు సరిహద్దుల్లో మహారాష్ట్ర ఉండడం, ఏ టా అక్కడి నుంచే నకిలీ విత్తనాలు సరఫరా అవుతుండటం షరా మామూలే. జిల్లాలో అధికంగా పత్తి, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని మండలాలైన బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, సిర్పూర్‌(టి), దహెగాం, పెంచికలపేట, వాంకిడి, దహెగాం తదితర ప్రాంతాలకు నిత్యం ఎక్కడో ఓ చోట నాసిరకం పత్తి విత్తనాలు దిగుమతి అవు తూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకొని చురుగ్గా దిగుమతి చేసి లక్షలు అర్జిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దులో నిఘా కఠినం చేసినట్లయితే అరికట్టే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. పత్తి విత్తనాల దందాకు ఇదే అదును కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అక్రమా ర్కులపై గతంలో పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోని కారణంగా విత్తన మాఫియా చెలరేగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

నాసిరకం విత్తనాలపై పకడ్బందీ నిఘా..

- బోర్కూట్‌ వెంకట్‌, జిల్లా వ్యవసాయ అధికారి

నాసిరకం పత్తి విత్తన మాఫియాపై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో నాసిరకం విత్త నాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. రైతులకు కూడా అవగా హన కల్పిస్తున్నాం.

Updated Date - Apr 25 , 2026 | 10:51 PM