Share News

ప్లాట్లుగా పారిశ్రామిక పార్కు భూమి!

ABN , Publish Date - Jul 02 , 2026 | 05:01 AM

పారిశ్రామిక పార్కు కోసం కేటాయించిన భూములను ఇళ్లు నిర్మించుకోవడానికి ప్లాట్లు చేసి విక్రయించడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ప్లాట్లుగా పారిశ్రామిక పార్కు భూమి!

  • హైకోర్టులో పిటిషన్‌.. తుది తీర్పునకు లోబడి భూ లావాదేవీలు: హైకోర్టు

పారిశ్రామిక పార్కు కోసం కేటాయించిన భూములను ఇళ్లు నిర్మించుకోవడానికి ప్లాట్లు చేసి విక్రయించడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పారిశ్రమిక పార్కు కోసం కూకట్‌పల్లిలో జీవోసీఎల్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం భూములు కేటాయించిందని, ఆ తర్వాత హిందూజా ఎస్టేట్‌, స్క్వేర్‌స్పేస్‌ ఇన్‌ఫ్రా సిటీ, హానర్‌ హోమ్స్‌ తదితర సంస్థలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయంటూ బోడుప్పల్‌కు చెందిన చింతల శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి మూడు వారాల సమయం కేటాయించింది. భూ లావాదేవీలన్నీ తాము ఇవ్వబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

Updated Date - Jul 02 , 2026 | 05:01 AM