ఇరాన్ క్షిపణి దాడిలో ఇందూరు వాసికి గాయాలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:09 AM
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నిజామాబాద్ జిల్లాలో ఆందోళన రేపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో కమ్మర్‌పల్లి ...
ఇజ్రాయెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి
కమ్మర్‌పల్లి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నిజామాబాద్ జిల్లాలో ఆందోళన రేపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన కోయల్‌కర్ తిరుపతి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి గత ఆరేళ్లుగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి ఆదివారం రాత్రి కారును శుభ్రం చేస్తుండగా అతడికి 100 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దాని పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలి తిరుపతి మెడ, గొంతు భాగంలో గుచ్చుకున్నాయి. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించినట్లు స్నేహితుల ద్వారా తెలిసింది.