Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:20 PM

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, హౌసింగ్‌ పీడీ ప్రకాష్‌రావులతో కలిసి ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయలన్నారు. మొదటి విడతలో 9,057 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, హౌసింగ్‌ పీడీ ప్రకాష్‌రావులతో కలిసి ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయలన్నారు. మొదటి విడతలో 9,057 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 7,757 ఇళ్ల పనులు వివిధ దశలలో ఉన్నాయని వివరించారు. మిగతా 1,300 ఇళ్ల పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పైలేట్‌ గ్రామాల్లో ఇళ్లను మంజూరు చేసి సంవత్సరం పూర్తయిందన్నారు. మార్చి 31 వరకు పనులు ప్రారంబించని ఇళ్లను రద్దు చేయాలని చెప్పారు. వివిధ దశలోఉన్న పనులు వేగవంతం చేసి మార్చిలో ప్రారంబోత్సవాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు ఇసుకను సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఇంకా పనులు ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడాలని చెప్పారు. త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆధార్‌ సరిగా లేకపోవడం, సాంకేతిక సమస్యలు, అటవీ సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతీ వారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బిల్లులు జమ చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల పురోగతి వివరాలు సమర్పించాలని ఎంపీడీవోలకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అవసరమైన చేతి పంపులు, బోరుబావులు, పైప్‌లైన్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అదికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 10:20 PM