ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:00 PM
ఇల్లు లే ని ప్రతీ పేదవాడికి ప్రభుత్వ ని ధులతో సొంతంగా ఇల్లు మం జూరు చేసినప్పుడు లబ్ధిదారు లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
కందనూలు/ తాడూరు, జూ న్ 25 (ఆంధ్రజ్యోతి) : ఇల్లు లే ని ప్రతీ పేదవాడికి ప్రభుత్వ ని ధులతో సొంతంగా ఇల్లు మం జూరు చేసినప్పుడు లబ్ధిదారు లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చెర్ల ఇటిక్యాల గ్రామంలో నూతనం గా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కా ర్యక్రమం లబ్ధిదారులతో కలిసి చేపట్టారు. మరో చోట ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మె ల్యే శంకుస్థాపన చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూ ర్తి కాగా మరికొద్ది రోజుల్లో మూడవ విడత ఇం దిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
శ్రీపురంలో విద్యుత్ దీపాల ప్రారంభం
నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రా మంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వీధి దీపాలను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. గ్రామంలో నూత నంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవే శంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీపురం గ్రా మంలోని కర్బలా హుస్సేన్ హజ్రత్ మౌలాలి అలీ అస్గర్ ఇమామ్ హుస్సేన్ పీర్లను దర్శించు కున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సర్పంచ్ గీతనర సింహా రెడ్డి, ఉప సర్పంచ్ జూపల్లి వెంకటయ్య, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.