ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:01 PM
ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులు ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని స్థా నిక సంస్థల అదనపు కలెక్టరు చం ద్రయ్య ఆదేశించారు. మండలంలో ని రాంపూర్, మల్లీడి గ్రామాల్లో నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయ న శుక్రవారం పరిశీలించారు.
అదనపు కలెక్టర్ చంద్రయ్య
భీమిని, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులు ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని స్థా నిక సంస్థల అదనపు కలెక్టరు చం ద్రయ్య ఆదేశించారు. మండలంలో ని రాంపూర్, మల్లీడి గ్రామాల్లో నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయ న శుక్రవారం పరిశీలించారు. లబ్దిదా రులకు ప్రభుత్వం తరపున ఆర్థిక స హాయం సకాలంలో అందేలా చూడా లని, పెండింగ్ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం గ్రా మంలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు జరుగుతున్న ప్రదేశం సంద ర్శించి ఉపాధిహామీ కూలీలతో మాట్లా డారు. ప్రతీ రోజూ కూలీలు అందరూ హాజరు కావాలని, ప్రతీ కుంటుంబానికి 100 రోజులు పని పూర్తి చేసుకోవాలన్నారు. అనంతరం మల్లీడి గ్రా మంలోని అండన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యా ర్థుల ఎత్తు, బరువులను పరిశీలించి విద్యార్థులకు, గర్భి ణుల కు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. భీమిని మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో రాంపూర్, ఇతర గ్రామాలకు సంబంధించిన భూ సమస్యలపై చేసి న ఫిర్యాదులను స్పందించి రికార్డులను పరిశీ లించి తక్ష ణమే పరిష్కరించాలని తహసీల్దార్ బికర్ణదా స్‌కు చె ప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగమోహన్, ఎం పీవో మహేష్, హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్, ఏపీవో స త్యప్రసాద్, ఈసీ రజేంద్రప్రసాద్, సర్పంచులు కర్నె మమత, రాంటెంకి దశరథ్, బండి శ్రీకాంత్ గౌడ్, టీఏ భార్గవ్ పాల్గొన్నారు.