చెంచులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - May 20 , 2026 | 11:11 PM
నియోజకవ ర్గంలో ఇళ్లు లేని నిరుపేద చెం చు కుటుంబాలందరికీ ఇందిర మ్మ గృహ నిర్మాణాలు చేపట్ట నున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
మన్ననూర్, మే 20 (ఆంధ్రజ్యోతి) : నియోజకవ ర్గంలో ఇళ్లు లేని నిరుపేద చెం చు కుటుంబాలందరికీ ఇందిర మ్మ గృహ నిర్మాణాలు చేపట్ట నున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ అన్నారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు చెంచు కాలనీలో ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవా రం భూమి పూజ చేసి ప్రారంభించారు. పే దల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, చెంచులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అఽధ్యక్షుడు ఎం ఏ రహీం, గ్రామ సర్పంచు విస్లావత్ మంజు ల, ఉప సర్పంచు రమణగౌడ్, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు రా జేంద్ర ప్రసాద్, శివ, బాల్‌లింగం, వెంకటయ్య, జూలూరి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రాజా రాం, బాలు, కప్పెర శ్రీను పాల్గొన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
ఉప్పునుంతల, మే 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్దపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వ ర్‌రావు తండ్రి లక్ష్మణ్ కొద్ది రోజుల క్రితం మర ణించాడు. బువారం జరిగిన దశదిశ కర్మ కార్య క్రమం ఉన్నందున ఎమ్మెల్యే వంశీకృష్ణ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షు డు కట్ట అనంతరెడ్డి, మామిళ్లపల్లి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నరసింహారావు, డిప్యూటీ సర్పంచ్ నరేష్‌యాదవ్, భాస్కర్‌రావు, సుధాకర్ రావు, మధు, నరేందర్‌రావు, శ్రీశైలం, తిరుపత య్యగౌడ్, డీలర్ వెంకయ్య, కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్య శిబిరం ప్రారంభం
అమ్రాబాద్, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విక్టోరియా రాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ వైద్య కళాశాల వైద్య బృందం రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందు లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్నందన్‌రెడ్డి, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి అపూర్వ, అమ్రాబాద్ సర్పంచ్ చిగుళ్ల కోటయ్య, ఉప సర్పంచ్ రాజారాంగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, కాంగ్రెస్ నాయకులు రాసమల్ల వెంకటయ్య, బాల్‌లింగంగౌడ్, ముక్రంఖాన్, మల్లేష్‌యాదవ్, సురేష్‌గౌడ్, వెంకటేశ్వర్లు తది తరులు పాల్గొన్నారు.