ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:19 PM
ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాల్లో వేగం పెంచి వెంటనే పూ ర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్టు డై రెక్టర్ గోపాల్‌నాయక్ లబ్ధిదారుల కు సూచించారు.
- హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్
తిమ్మాజిపేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాల్లో వేగం పెంచి వెంటనే పూ ర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్టు డై రెక్టర్ గోపాల్‌నాయక్ లబ్ధిదారుల కు సూచించారు. తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, అప్పాజీ పల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ఎంపీడీవో శ్రీహరితో కలిసి గురువారం పరిశీలించి లబ్ధిదా రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ సమావేశంలో పా ల్గొన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు సకా లంలో పూర్తయ్యేలా చూడాలని గ్రామ పంచా యతీ కార్యదర్శులకు సూచించారు. లబ్ధిదారులు తమ ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు తప్పక నిర్మించుకోవాలన్నారు. హౌసింగ్ డిప్యూటీ ఇంజ నీర్ హర్యానాయక్, ఎంపీవో రాములునాయక్, హౌసింగ్ ఏఈ యాసినా, ఆయా గ్రామాల స ర్పంచ్‌లు భాస్కర్‌గౌడ్, వెంకటయ్య, పంచాయ తీ కార్యదర్శులు ఉన్నారు.