సీఎం ఫొటోతో గృహప్రవేశం
ABN , Publish Date - May 16 , 2026 | 04:48 AM
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ముగ్గురు లబ్ధిదారులు శుక్రవారం గృహప్రవేశం చేశారు.
సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారుల హర్షం
కేసముద్రం, మే 15 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ముగ్గురు లబ్ధిదారులు శుక్రవారం గృహప్రవేశం చేశారు. ఈ లబ్ధిదారుల్లో బట్టు స్వప్న-మధు దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలోకి సీఎం రేవంత్ చిత్రపటాన్ని పట్టుకొని గృహప్రవేశం చేశారు. సొంతిల్లు నిర్మించుకోవాలని కొన్నేళ్ల నుంచి తమకు ఉండేదని, రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక చేయూతనివ్వడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.