Share News

అర్హులందరికీ ఇందిరమ్మ బీమా

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:23 PM

పేద మధ్య తరగతి కుటుం బాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ బీమా పథకాన్ని అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం దండేపల్లి మండలం కాసిపేటలో నూ తనంగా నిర్మించిన విలేజ్‌ ఆర్గనైజేషన్‌ వివో భవనాన్ని జిల్లా ఆదనపు కలె క్టర్‌ చంద్రయ్య డీఆర్డీఏ కిషన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

అర్హులందరికీ ఇందిరమ్మ బీమా
లబ్దిదారులుకు పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీఏ, సర్పంచ్‌

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

దండేపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేద మధ్య తరగతి కుటుం బాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ బీమా పథకాన్ని అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం దండేపల్లి మండలం కాసిపేటలో నూ తనంగా నిర్మించిన విలేజ్‌ ఆర్గనైజేషన్‌ వివో భవనాన్ని జిల్లా ఆదనపు కలె క్టర్‌ చంద్రయ్య డీఆర్డీఏ కిషన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం అ నేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రూ 5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేప ట్టినట్లు తెలిపారు. లబ్ధిదారులందరు దరాఖాస్తు చేసుకోవాలన్నారు. అనం తరం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారు లకు పెన్షన్‌ పత్రాలను అందజేశారు. మండలంలోని చింతపల్లి, లక్ష్మికాం తపూర్‌ గ్రామాల్లోని నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యలయా లను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీ వో జేఆర్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, ఏఎంసీ ఛైర్మన్‌ వెం కటేశ్వర్లు, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఛైర్మన్‌ శంకరయ్య, ఆర్జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు అనిత, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 10:24 PM