Share News

ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్‌ విస్తీర్ణంపై పరిమితులు

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:30 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకునే ఇళ్ల స్లాబ్‌ పరిమాణాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇంటి ముందువైపు 3 అడుగులు...

ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్‌ విస్తీర్ణంపై పరిమితులు

  • ఇంటి ముందువైపు 3 అడుగులు, మిగతా వైపుల ఒక్క అడుగు ఉండాలని ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకునే ఇళ్ల స్లాబ్‌ పరిమాణాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇంటి ముందువైపు 3 అడుగులు, మిగతా అన్ని వైపులా ఒక్క అడుగు చొప్పునే స్లాబ్‌ ఉండాలని సూచిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిని 400 నుంచి 600 చ.అడుగుల వరకే నిర్మించుకోవాలని ప్రస్తుతం నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం 400 చ.అడుగుల్లో నిర్మించుకునే ఇంటికి 500 చ.అడుగుల వరకు, 600 చ.అడుగుల్లో నిర్మించే ఇంటికి 750 చ.అడుగుల వరకు స్లాబ్‌ను వేసుకోవచ్చని ప్రభు త్వం పేర్కొంది. కిటికీలకు రక్షణ కోసం కూడా స్లాబ్‌కు బదులు సన్‌షెడ్లను వాడాలని, ఇంటి ముందుభాగంలో అదనపు నీడ కావాలనుకుంటే జీఐ షీట్‌ ఆధారిత షెడ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 28 , 2026 | 03:30 AM