Share News

kumaram bheem asifabad- అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:24 PM

జిల్లాలో అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లోని ఆడ బిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించెందుకు గాను కల్యాణలక్ష్మి పథకం ఎంతగానో దోహాద పడుతుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

kumaram bheem asifabad- అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

జైనూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లోని ఆడ బిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించెందుకు గాను కల్యాణలక్ష్మి పథకం ఎంతగానో దోహాద పడుతుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చాలి మంది నిరుపేదలకు పక్కా గృహాలు లేవని తమ వద్దకు వస్తున్నారని అన్నారు. గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధలు మంజూరయ్యేల చొరవ చూపాలని దుబ్బగూడ గ్రామ సర్పంచ్‌ మడావి కౌల్యాభీంరావ్‌ ఎమ్మెల్మేను కోరారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఎంపీడీవో క్రిష్ణవేణి, ఎంపీవో శశికుమార్‌, సూపరింటెండెంట్‌ మల్లేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, సర్పంచులు కొడప ప్రకాష్‌, కుంర యశోద కేశవ్‌రావ్‌, ఆత్రం తులసీ శంకర్‌, మాజీ సర్పంచులు మడావి భీంరావ్‌, కందారె బాలాజీ, ఆత్రం జాలీంషా, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ గేడాం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 10:24 PM