Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:38 PM

నియోజకవర్గం లోని అర్హులైన ప్రతీ కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గం లోని అర్హులైన ప్రతీ కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల ను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లోని తన ని వాసంలో మంగళవారం నియోజకవర్గంలోని హౌసింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, మునిసిప ల్‌ అధికారులతో ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధి ప నులపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి ప్ర భుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అ ధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూ చించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డీఈలు హరి, సురేష్‌, ఎంపీడీవోలు సీత, గీత, సుజాత, సులోచన, జయరాం, విజయలక్ష్మి, శంకర్‌, ము నిసిపల్‌ కమిషనర్లు మహమ్మద్‌ షేక్‌, రాఘవేం దర్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈలు హరి, సురేష్‌, కేదా ర్‌నాథ్‌, పల్లవి, శాలిని, చక్రి, పృథ్వీరాజ్‌, క్రాంతి, మునిసిపల్‌ ఏఈలు పాల్గొన్నారు. ల

Updated Date - Sep 22 , 2026 | 11:38 PM