అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:12 PM
గ్రామాల్లో గు డిసెల్ని తొలగించి, పక్కా గృ హాలు నిర్మించేందుకే ఇంది రమ్మ ఇంటి పథకం అమలు చే స్తున్నామని నాగర్‌కర్నూల్ ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
తిమ్మాజిపేట (నాగర్‌కర్నూ ల్)/ బిజినేపల్లి/ కందనూ లు/ తెలకపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో గు డిసెల్ని తొలగించి, పక్కా గృ హాలు నిర్మించేందుకే ఇంది రమ్మ ఇంటి పథకం అమలు చే స్తున్నామని నాగర్‌కర్నూల్ ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. అర్హులం దరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని, ఎ వరూ అధైర్య పడవద్దని ఆయన తెలిపారు. తి మ్మాజిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ పథకం కింద రెండవ విడతలో మం జూరైన 34 మంది లబ్ధిదారులకు బుధవారం ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. అనం తరం మండల కేంద్రంలోని జడ్పీ హెచ్‌ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడాపోటీలను జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభిం చారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బావాజీపల్లి పాఠశాలలో కూచకుళ్ల ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు క్రీడల యూ నిఫామ్స్ అందజేసి నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీడీవో శ్రీహరి, ఎంఈవో సత్యనారాయణశెట్టి, హౌసింగ్ ఏఈ యాసిన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మ ల్లయ్యగౌడ్, రాష్ట్ర టెలికాం శాఖ డైరెక్టర్ శ్రీని వాస్ బహుదూర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవులు, కాంగ్రెస్ నాయకులు కొండా నగేష్, లక్ష్మీ నారాయణ, రామకృష్ణగౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగసాయిలు, అనంతచారి, మల్లేష్, ఎల్లా రెడ్డి, సర్పంచ్ లక్ష్మయ్య, సర్పంచ్ చందు తదిత రులు పాల్గొన్నారు.
బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు లు, స్మార్ట్‌రేషన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశా రు. ప్రతిపక్షాలు ఎన్నితప్పుడు ప్రచారాలు చేసి నా అభివృద్ధి బాటలోనే సాగుతామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ చైర్మన్ రమణారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటస్వా మి, తహసీల్దార్ మునీరుద్దీన్, డీటీ రవికుమార్, ఎం పీడీవో కతలప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు మిద్దె రాములు, డీలర్ల సంఘం నాయకులు శంకర్, నరేందర్, మహేశ్, రాజేష్, భాస్కరా చారి, నాయకులు పాల్గొన్నారు.
కందనూలులోని జిల్లా పరిషత్ బాలుర ఉ న్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడాప టీ ల సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అభినందించారు. మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్రకుమార్, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు శంకర్, ఎంఈవో కుర్మయ్య పాల్గొన్నారు.
తెలకపల్లి మార్కెట్ యార్డలో ఏర్పాటు బుధవారం సాయంత్రం స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అందజేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని అన్నా రు. సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, మార్కెట్ చైర్మన్ మామిళ్ళపల్లి యాదయ్య, కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు బండ పర్వతాలు, మహిళలు పాల్గొన్నారు.