Share News

kumaram bheem asifabad- ఇందిరా మహిళా శక్తి భవనం.. చకచకా నిర్మాణం

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:16 PM

మహిళా సంఘాలను అభివృద్ధి చేసి మహిళలను కోటీశ్వర్లును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే 80 శాతం పనులు పూర్తయ్యాయి.

kumaram bheem asifabad- ఇందిరా మహిళా శక్తి భవనం.. చకచకా నిర్మాణం
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం

- రూ.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు

- త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు

ఆసిపాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలను అభివృద్ధి చేసి మహిళలను కోటీశ్వర్లును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే 80 శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలో భవనాన్ని ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసర త్తు చేస్తోంది. జిల్లాలోని మహిళా సంఘాల నిర్వాహ కులు, సభ్యులకు శిక్షణ, జిల్లా స్థాయి సమావేశాల నిర్వాహణకు ఈ భవనం వేధికగా నిలువనుంది. జిల్లా గ్రామీణాభివ్రుద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఇటీవల జిల్లా కలెక్టర్‌ కె హరిత భవననిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించా రు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఇంజనీ రింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

- గ్రామ, మండల స్థాయి..

జిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాఽథమిక సభ్యులతో జిల్లా స్థాయి సమావేశాలను శిక్షణ కోసం ఇందిరా మహిళా శక్తి భవనాన్ని రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్త్తోంది. ఈ భవనంలో మహిళా సంఘాల సభ్యుల విసృత సమావేశాలకు విశాలమైన హాల్‌తో పాటు జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడానికి సైతం ప్రత్యేక హాళ్లను నిర్మిస్తున్నా రు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇందిర మహిళా శక్తి భవనం నుంచి నిర్వహించనున్నారు. వీటితో పాటు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను ఈ భవనంలో ఏర్పాటు చేసి మార్కెట్‌ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తారు. వాటిద్వారా తోటి సభ్యులకు ఆదర్షంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మహిళా శక్తి భవనంలో వీవోఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం విఓఏలు మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మహిళా సంసఘాలకు అవగాహన కల్పిస్తారు. తద్వారా మహిళలకు అనేక రకాలుగా ఆర్థికాభివృద్దిని సాధించేందుకు ఇందిర మహిళా శక్తి భవనం కేంద్రంగా మారనున్నది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా 8,236 మహిళా స్వయం సహాయక సంఘాల పరిధిలో 94,569 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల్లోని సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలు స్ర్తీనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలతో స్వయం ఉపాధిని పొందుతున్నారు. వీరు మరింత ఆర్థికాభివ్దృద్దిని సాధించి కోటీశ్వరులుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఇందిర మహిళా శక్తి భవనాలను వేధికలుగా తయారు చేయనుంది. ఇందులో మహిళలకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఆ రంగాల్లో అభివృద్ద్ది సాధించేందుకు కావల్సిన అన్ని రకాల వసతులను కల్పించనున్నారు.

మహిళా సంఘాలకు ప్రయోజనం..

పద్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు, ఆసిఫాబాద్‌

ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణంతో మహిళా సంఘాల సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మహిళా సంఘాల సభ్యుల సమావేశాలకు, వృత్తి నైపుణ్య శిక్షణ నిర్వహించు కోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుంది. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకం అందించడం హర్షించ దగ్గ పరిణామం.

Updated Date - Jun 09 , 2026 | 10:16 PM