IndiGo Flight Delayed: రన్‌వేపై మొరాయించిన ఇండిగో విమానం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:46 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో రన్‌వేపై మొరాయించింది.
రెండు గంటలకుపైగా ప్రయాణికుల పడిగాపులు
శంషాబాద్ రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో రన్‌వేపై మొరాయించింది. సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరిన 6ఈ 327 ఇండిగో విమానం రన్‌వేపైకి వెళ్లగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని తిరిగి బేస్ నం.14కు తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. దాదాపు రెండు గంటలు శ్రమించిన ఇంజినీర్లు ఎట్టకేలకు మరమ్మతులు పూర్తి చేయడంతో తిరిగి 5.22 గంటలకు ఆ విమానం బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు దాదాపు రెండు గంటలకుపైగా పడిగాపులు కాయాల్సి రావడం, విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.