74 రోజులకు సరిపడా పెట్రోలియం నిల్వలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:24 AM
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దృఢంగా ఉంటూ...
రాజకీయ పబ్బం కోసం ప్రతిపక్షాల కుట్రలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దృఢంగా ఉంటూ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుంటోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలు మాత్రం పెట్రో ఉత్పత్తుల కొరత ఉందంటూ ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, మంగళూరు, పదూర్ ప్రాంతాల్లో భారీ భూగర్భ పెట్రోలియం నిల్వలున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దాదాపు 74 రోజుల వరకు అవసరమైన పెట్రోలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన 90 లక్షల భారతీయుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.