Share News

20న మందుల దుకాణాల బంద్‌ను వ్యతిరేకి స్తున్నాం

ABN , Publish Date - May 19 , 2026 | 04:59 AM

ఔషధ చట్టాలను ఉల్లంఘిస్తూ క్రయ విక్రయాలు చేస్తున్న మందుల దుకాణాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని...

20న మందుల దుకాణాల బంద్‌ను వ్యతిరేకి స్తున్నాం

  • ప్రభుత్వానికి ఇండియన్‌ ఫార్మసిస్ట్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఔషధ చట్టాలను ఉల్లంఘిస్తూ క్రయ విక్రయాలు చేస్తున్న మందుల దుకాణాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని... డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ ఫార్మసిస్ట్‌ అసోసియేషన్‌ (ఐపీఏ) తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 20న డ్రగ్గ్గిస్ట్‌ కెమిస్ట్‌ అసోసియేషన్‌ మందుల దుకాణాల బంద్‌కు పిలుపు ఇవ్వడం హాస్యాస్పదమని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐపీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ తేజావత్‌ శివకుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఐపీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజమైన ఫార్మసిస్టులకు అన్యాయం జరగకుండా ఫార్మసీ చట్టం సెక్షన్‌42ని కఠినంగా అమలు చేయాలని శివకుమార్‌ కోరారు. రిజిస్టర్డ్‌ ఫార్మసి్‌స్టతో నడిపే ఫార్మసీలను యఽథావిధిగా తెరవాలని ఐపీఏ రాష్ట్ర ఇన్‌చార్జి నరసింహ విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 19 , 2026 | 04:59 AM