గల్ఫ్ దేశాల్లో గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:33 AM
భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. దుబాయిలో తెల్లవార్లూ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భారీ సంఖ్యలో భారతీయ ప్రవాసులు త్రివర్ణ పతాకాన్ని చేబూ ని భారతీయ కాన్సులేట్‌కు చేరుకున్నారు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. దుబాయిలో తెల్లవార్లూ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భారీ సంఖ్యలో భారతీయ ప్రవాసులు త్రివర్ణ పతాకాన్ని చేబూ ని భారతీయ కాన్సులేట్‌కు చేరుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దాలో భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి పతాకాన్ని ఆవిష్కరించారు. కర్నూలు నగరానికి చెందిన ఈ యువ దౌత్యవేత్త ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు కృషి చేస్తున్నారు. రియాద్‌లోని భారతీయ రాయబారి డాక్టర్ సోహల్ అహ్మద్ పతాకావిష్కరణ చేశారు. జెద్దా, రియాద్, దమ్మాం, జుబైల్, తాయిఫ్, తబూ క్ నగరాల్లోని భారతీయ పాఠశాలల్లోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి. దుబాయిలో భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ శివన్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఆదివారం రాత్రి జరిగిన విందులో దుబాయిలోని ప్రముఖ ప్రవాసులతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్ కూడా పాల్గొ న్నారు. బహ్రెయిన్‌లో తెలుగు కళా సమితి తమ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించగా అధ్యక్షుడు జగదీశ్ పతాకావిష్కరణ చేశారు. అబుదాబి, మస్కట్, కువైత్, దోహా నగరాల్లోనూ వేడుకలు నిర్వహించారు.