2030నాటికి దేశంలో 2,400 జీసీసీలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:12 AM
దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) సంఖ్య మరో ఐదేళ్లలో 2,400కు చేరొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌్క్షఇండస్ట్రీ(ఫిక్కీ) అంచనా వేశాయి.
అనరాక్, ఫిక్కీ సంయుక్త నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) సంఖ్య మరో ఐదేళ్లలో 2,400కు చేరొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌్క్షఇండస్ట్రీ(ఫిక్కీ) అంచనా వేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,700కు పైగా జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 19 లక్షల మందికి పైగా నిపుణులైన ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి ఈ ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు పెరగనుందని అనరాక్, ఫిక్కీ ఓ నివేదికలో తెలిపాయి. 2019లో 30 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం విలువ, 2024 చివరి నాటికి సుమారు 64 బిలియన్ డాలర్లకు పెరిగిందని, 2030 నాటికి ఇది 105-110 బిలియన్ డాలర్లకు చేరుతుందని వివరించాయి. దేశంలోని టాప్ 7 నగరాల్లోని మొత్తం స్థూల ఆఫీస్ లీజింగ్‌లో జీసీసీలు ఇప్పుడు 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని వెల్లడించాయి. దేశంలో జీసీసీల హబ్‌గా బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో పుణె, మూడో స్థానంలో హైదరాబాద్ ఉన్నాయి.