Share News

Global Largest Election: 2 కోట్ల మంది సిబ్బందితో భారత్‌లో ఎన్నికలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:48 AM

దేశవ్యాప్తంగా దాదాపు 97.9 కోట్ల మంది ఓటర్ల కోసం 2024-25లో జరిపిన ఎన్నికల్లో 2 కోట్ల మందికిపైగా సిబ్బందిని వినియోగించామని...

Global Largest Election: 2 కోట్ల మంది సిబ్బందితో భారత్‌లో ఎన్నికలు

  • ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పోలింగ్‌ కసరత్తు

  • బ్రెజిల్‌ పర్యటనలో వివరించిన సీఈవో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా దాదాపు 97.9 కోట్ల మంది ఓటర్ల కోసం 2024-25లో జరిపిన ఎన్నికల్లో 2 కోట్ల మందికిపైగా సిబ్బందిని వినియోగించామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తుగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్ర అధికారుల బృందం మంగళవారం బ్రస్సెల్స్‌లో ఎఫ్‌పీఎస్‌ ఇంటీరియర్‌ డైరెక్టర్‌ జనరల్‌ హెచ్‌ఈ అన్నబెల్‌ హాగెమాన్‌తో పాటు యూరోపియన్‌ పార్లమెంట్‌ ఉన్నతాధికారులను కలిసింది. ఈ సందర్భంగా మనదేశంలోని ఎన్నికల ప్రక్రియ గురించి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల జాబితాను భారత్‌ నిర్వహిస్తోందని తెలిపారు.

Updated Date - Jan 15 , 2026 | 06:49 AM