10,720 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్లాంట్లకు
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:58 AM
తెలంగాణలోని జలాశయాల్లో 10,720 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ (తేలియాడే) సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయని కేంద్ర నూతన...
రాష్ట్రంలో అనుకూలతలు: కేంద్రం నివేదిక
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జలాశయాల్లో 10,720 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ (తేలియాడే) సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయని కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) తెలిపింది. ఈ మేరకు గురువారం నివేదికను వెలువరించింది. దేశవ్యాప్తంగా జలాశయాల్లో 1,02,180 మెగావాట్లు ప్లాంట్లు పెట్టడానికి అనుకూలతలు ఉండగా... అత్యధికంగా మహారాష్ట్రలో 16,280 మెగావాట్లు, యూపీలో 14,890 మెగావాట్లు, కర్ణాటకలో 13,690 మెగావాట్లు, ఆ తర్వాత 10,720 మెగావాట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఈ ప్లాంట్లతో జలాశయాల్లో ఆవిరి నష్టాలు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా రానుందని గుర్తించారు. తాజాగా సొంత అవసరాలకు విద్యుత్ వాడుకునేందుకు క్యాప్టివ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది.