Share News

kumaram bheem asifabad- పెరిగిన డిమాండ్‌.. తగ్గిన సాగు

ABN , Publish Date - Feb 22 , 2026 | 10:34 PM

ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్‌ ఉన్నా జిల్లాలో సాగు తగ్గింది. దీనికి తోడు రవాణా దూరం కావడం, కూలీల భారం పెరగడంతో మిర్చి సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మిర్చి మార్కెట్‌ లేక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నా రు. వచ్చిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాగ్‌పూర్‌, వరంగల్‌ ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకోవల్సిన పరిస్థితి నెలకొంది.

kumaram bheem asifabad- పెరిగిన డిమాండ్‌.. తగ్గిన సాగు
మిర్చి పంట

- రవాణా దూరం.. కూలీల భారం

కౌటాల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్‌ ఉన్నా జిల్లాలో సాగు తగ్గింది. దీనికి తోడు రవాణా దూరం కావడం, కూలీల భారం పెరగడంతో మిర్చి సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మిర్చి మార్కెట్‌ లేక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నా రు. వచ్చిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాగ్‌పూర్‌, వరంగల్‌ ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకోవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దూర భారంతో పాటు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందు తున్నారు. దీంతో ఈ ఏడాది రైతులు మిర్చి పంటపై ఆసక్తి చూపలేదు. కౌటాల మండలంలో అందరు రైతుల్లా ఒకే రకం పంట సాగు చేయకుండా ఇక్కడి రైతులు వాణిజ్య పంట అయిన మిర్చి పంట వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో కొంత మంది రైతులు మాత్రమే మిర్చి సాగు చేస్తుండగా అధిక దిగుబడితో పాటు అదిక రాబడి వచ్చేది. క్రమేనా ఇతర రైతులు సైతం మిర్చి వైపు మొగ్గు చూపుతుండడంతో దిగుబడి వస్తున్నా అంతకు తగ్గట్లుగా రాబడి రావడం లేదు. దీనికి తోడు రైతులు ఇక్కడ పండిన పంటను విక్రయిం చేందుకు స్థానికంగా మార్కెట్‌లు లేక పోవడంతో సమీపంలోని మహరాష్ట్రకు తరలించి విక్రయిస్తుండ డంతో పెట్టుబడులతోనే సంతృప్తి చెందాల్సి వస్తుం దని రైతులు పేర్కొంటున్నారు.

- మండల పరిధిలో..

కౌటాల మండలంలో అధిక శాతం మంది రైతు లు మిర్చి పంట సాగుపై దృష్టి పెట్టడంతో ఆశిం చిన స్థాయిలో గిట్టుబాటు ధర రాక పోవడం, రవా ణా భారంతో నష్టాలు చవిచూసే వారు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి రైతులు మిర్చి మంటను తక్కువ శాతంలో పండించారు. ముఖ్యంగా మండలంలోని తాటిపల్లి, కన్కి, మొగడ్‌ దగడ్‌, గుడ్లబోరి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, సాండ్‌గాం, పార్డి, వీరవెల్లితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సుమారు మిర్చి పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో 800 మంది రైతులు 1,400 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తుండగా అధికంగా కౌటాల మండలంలోని మిర్చి పంట పండిస్తున్నారు. దీంతో పాటు దహెగాం 95 ఎకరాల్లో, పెంచికలపేట లో 90 ఎకరాల్లో, చింతలమానేపల్లిలో 49 ఎకరాల్లో, సిర్పూర్‌(టి)లో 53 ఎకరాలతో పాటు జిల్లాలోని మిగితా మండలాల్లో పంట సాగు చేస్తున్నారు.

- మహారాష్ట్ర సరిహద్దు కావడంతో..

కౌటాల మండలం మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో సరిహద్దు గ్రామలైన తాటిపల్లి, కన్కి, మొగడ్‌దగడ్‌, గుడ్లబోరి 1,100 ఎకరాల పైన మిర్చి పంట సాగు అవుతుంది. ఇక్కడ పండిన పంటకు మహారాష్ట్రలో అధిక డిమాండ్‌ ఉండడంతో ఈ ప్రాంత రైతులు నాగ్‌పూర్‌కు తీసుకెళ్లి అమ్ముతు న్నారు. గతంలో కౌటాల ప్రాంత మిర్చికి అదిక డిమాండ్‌ ఉండేది. మాక్చర్‌ ఉన్నప్పటికీ కౌటాల మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడేవారు. క్వింటాలుకు రూ.20 వేలు నుంచి రూ.24 వేలు పలకడంతో అధిక లాభాలు వచ్చేవి. ప్రస్తుతం సాగు విస్తీర్ణం తగ్గడంతో మిర్చికి డిమాండ్‌ పెరిగింది.

- పంట కోతకు..

మిర్చి పంట కోసేందుకు కూలీల కొరత అధికం గా ఉండడంతో సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూలీలను తీసుకు వస్తున్నారు. కిలోకు రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. ఇటు దిగుబడి సరిగ్గా రాక అటు రవాణా భారం పెరగ డం, ధర లేక పోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావన్న ఆందోళనతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో కష్ట పడి కంటి పాపాల పండించిన పత్తి పంట వరంగల్‌ లేదా నాగ్‌పూర్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుండడంతో రవాణా భారం పెరిగి పోతుందని ఈ ప్రాంతంలోనే మార్కెట్‌ యార్డు ఏ ర్పాటు చేస్తే బాగుటుందని రైతులు భావిస్తున్నారు.

మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేయాలి..

- బడిగే దావూజీ పటేల్‌, కౌటాల

ఈ ప్రాంతంలో పండించిన మిర్చి పంటను విక్రయించేందుకు మార్కెట్‌ యార్డు లేక పోవడంతో పంటను అమ్ముకునేందుకు ఎన్నో వ్యయ ప్రయా సాలకు గురవుతున్నాం. పంటను విక్రయించేందుకు వరంగల్‌ లేదా నాగ్‌పూర్‌కు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దూరభారం అవు తుంది. స్థానికంగా మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.

స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటున్నాం..

- దత్తు పాండురంగ్‌, కౌటాల

మార్కెట్‌ యార్డు సౌకర్యం లేకపోవడంతో స్థానిక వ్యాపారులకే మిర్చి పంటను విక్రయిస్తు న్నాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకు విక్రయించ డంతో నష్ట పోవాల్సి వస్తుంది. దీనికి తోడు కూలీల కొరత సైతం అధికంగా ఉంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - Feb 22 , 2026 | 10:34 PM