ప్రకృతి సేధ్యంతో ఆదాయం.. ఆరోగ్యం
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:47 PM
ప్రకృతి వ్యవసాయం చేస్తే స మాజానికి ఆరోగ్యాన్ని పంచడంతో పాటు రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. నెన్నెల మం డలం జోగాపూర్ రైతు వేధికలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఏవో పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు, సాగు పద్ధతి గూర్చి వివరించారు. పంటల్లో విచక్షణ రహితంగా రసాయన ఎ రువుల వాడకంతో మట్టి సహజత్వాన్ని కోల్పోతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పంట మార్పిడీ చేస్తూ సేంద్రీయ ఎరువులను వాడా లని సూచించారు.
-జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
నెన్నెల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి వ్యవసాయం చేస్తే స మాజానికి ఆరోగ్యాన్ని పంచడంతో పాటు రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. నెన్నెల మం డలం జోగాపూర్ రైతు వేధికలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఏవో పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు, సాగు పద్ధతి గూర్చి వివరించారు. పంటల్లో విచక్షణ రహితంగా రసాయన ఎ రువుల వాడకంతో మట్టి సహజత్వాన్ని కోల్పోతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పంట మార్పిడీ చేస్తూ సేంద్రీయ ఎరువులను వాడా లని సూచించారు. యాసంగి సీజన్‌లో పంటలు సాగు చేసు కునే రైతు లు సకాలంలో నాట్లు వేసుకోవాలన్నారు. ఆలస్యమైతే కోతల సమ యం లో అకాల వర్షాలతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. యాసంగిలో వరికి బ దులు శనగ, పెసర, మినుములు లాంటి పప్పుదినుసులు పండిస్తే లాభాలు వస్తాయన్నారు. అయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ప్రాంత రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాఽధించవచ్చన్నారు. ఆహార భద్ర త పథకంలో 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వేప నూనే అందుబాటులో ఉందన్నారు. అవసరమైనవారు ఏఈవోలను సంప్రదిం చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పు ప్పాల సృజన, హార్టికల్చర్ అధికారి అరుణ్‌కుమార్, జోగాపూర్, ఘన్ పూర్ సర్పంచులు దుర్గం శ్రీవిద్య, గన్న సతీష్, ఉపసర్పంచ్ గడ్డం వాణి, ఏఈవో శైనీ, హెచ్‌ఈవో కుమార్ పాల్గొన్నారు.