Share News

kumaram bheem asifabad- వర్మీ కంపోస్టు తయారీతో రైతులకు ఆదాయం

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:20 PM

వర్మీ కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సకూరుతుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాదుల కార్యక్రమానికి బుధవారం కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- వర్మీ కంపోస్టు తయారీతో రైతులకు ఆదాయం
వర్మీ కంపోస్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె.హరిత

కౌటాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వర్మీ కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సకూరుతుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాదుల కార్యక్రమానికి బుధవారం కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మి కంపోస్టు తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ జీవనోపాఽధి మార్గాలను అవలంభించి, అదనపు ఆదాయం పొందేలా ప్రొత్సాహించాలన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుదల, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణ జీవనోపాదుల బలోపే తానికి దోహపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ జిల్లా సమన్వయ కర్త డాక్టర్‌ బాలరాజు రాజారాం, ప్రొగ్రాం ఆఫీసర్‌ ప్రతాప్‌, కౌశిక్‌, అడ్మిన్‌, వినయ్‌, ఎస్‌టు పోషన్‌ పొగ్రాం అదికారి సాయి లిఖిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరించాలి..

భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. కౌటాల తహసిల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భూ భారతిలో వచ్చే దరఖాస్తును వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిపేరు ఓటరు జాబితాలో ఉండేట్టు చూడాలన్నారు. మ్యాపింగ్‌ కాని వారికి ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో శిబిరాలను ఫారం-6 దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో నాయిబ్‌ తహసిల్దార్‌ హరిలాల్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 10:20 PM