Share News

kumaram bheem asifabad- నేడు జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పర్యటన

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:15 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి రూ.257.27 కోట్ల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. రోడ్డు మార్గం ద్వారా మేడారం నుంచి జిల్లాకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకొని కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేస్తారు

kumaram bheem asifabad- నేడు జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పర్యటన
వాంకిడిలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ నితికాపంత్‌

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆసిఫాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి రూ.257.27 కోట్ల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. రోడ్డు మార్గం ద్వారా మేడారం నుంచి జిల్లాకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకొని కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేస్తారు. రూ.26 కోట్లతో 30 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ కోసం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొం టారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలోని వాంకిడి మండలానికి చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకొని పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని ఓ పంక్షన్‌ హాల్‌లో నిర్వహించే ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేర నున్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సాయంత్రం 4:15 నుంచి 5:30 గంటల వరకు వాంకిడి మండలంలో పర్యటించనున్నారు. వాంకిడి మండలంలోని బెండార గ్రామ సమీపంలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వాంకిడి కేజీబీవీ పాఠశాలలో రూ. 67.50 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. అనంతరం వాంకిడి కలాన్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రూ. 203. కోట్లతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేస్తారు. ఏహెచ్‌ఎస్‌ బాళికల అశ్రమోన్నత పాఠశాలలో రూ. 60 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను రూ. 1.56 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (సీహెచ్‌సీ) భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చిన్నుగూడ గ్రామంలో రూ. 13.50 లక్షలతో నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల భవనాన్ని, జైత్‌ పూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొంటారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్బంగా వాంకిడి మండలంలోని బెండార గ్రామ సమీపంలో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలాన్ని, కేజీబీవీ పాఠశాలను ఎస్పీ నితికాపంత్‌ భద్రత ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. మంతి పర్యటన సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు తదితర అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చిత్తరంజన్‌, సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్‌ ఉన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 10:15 PM