Share News

kumaram bheem asifabad- ఎడతెరిపిలేని వాన

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:54 PM

జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా అత్యధికంగా తిర్యాణిలో అత్యధికంగా 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.. మంగళవారం ఆర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిం చాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవ డంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

kumaram bheem asifabad-  ఎడతెరిపిలేని వాన
గూడెన్‌ఘాట్‌ వాగు ఉధృతిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ హరిత

- ఉప్పొంగిన వాగులు, ఒర్రెలు

- ప్రజల రాకపోకలకు అంతరాయం

- వట్టివాగు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

-వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

ఆసిఫాబాద్‌,జూలై 29(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా అత్యధికంగా తిర్యాణిలో అత్యధికంగా 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.. మంగళవారం ఆర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిం చాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవ డంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్‌ మండలంలో కురిసిన భారీ వర్షానికి తుంపల్లి గ్రామ సమీపంలోని గూడెన్‌ఘాట్‌ వాగు, గుండి వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వాగు లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు, మత్స్యకా రులు అటువైపు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బందిని జిల్లా అధికార యంత్రాంగం నియమించింది. మండలంలోని వరద ప్రవహ తీరును జిల్లా కలెక్టర్‌ కె.హరిత,జిల్లా ఎస్పీ నితికా పంత్‌లు గూడేన్‌ఘాట్‌ వాగు వద్దకు వెళ్లి పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు,వరదల నేపఽథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థి తుల్లో 8500844365 నంబరులో సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాలకు కుమరంభీం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరింది. వట్టివాగు ప్రాజెక్టులోకి 6,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో మూడు గేట్లు పైకి ఎత్తి 5,400 క్యూసెక్కుల వరదనీటిని కింది వదులుతున్నారు. దీంతో పెద్దవాగు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆసిపాబాద్‌ మండలంలో కురిసిన వర్షాలకు పెద్దవాగు, గుండివాగు, గూడెన్‌ఘాట్‌, అప్పపల్లి, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిర్యాణి మండలంలో కురిసిన భారీ వర్షానికి మణిక్యాపూర్‌ గ్రామ సమీపంలోని లోలెవల్‌ వంతెనపై నుంచి వరద నీరు ఉప్పోంగి ప్రవహించగా అయా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిన్నెధరి వాగు వంతెనను తాకుతూ ఉధృతంగా ప్రవహించింది. లింగాపూర్‌ మండలంలో కురిసిన వర్షానికి పిట్లగూడ వాగు ఉప్పోంగి ప్రవపించడంతో అయా గ్రామాలకు రెండు గంటలపాటు రాకపోకలు నిలిచి పోయాయి. మండలంలోని కుమనాయక్‌తాండలో వరదనీరు పాఠశాలలోకి వచ్చి చేరింది.

గడిచిన 24 గంటల్లో..

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 40.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిర్యానిలో మండలంలో 107.4 మిల్లీమీటర్లుచ, అత్యల్పంగా వాంకిడిలో 2.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 107.4, లింగాపూర్‌లో 96, కెరమెరిలో 62.6 జైనూరులో 56.0, సిర్పూర్‌ (యు)లో 56.3, పెంచికల్‌పేటలో 42.8, బెజ్జూరులో 36.1 రెబ్బెనలో 32.1, దహెగాంలో 30.3 ఆసిఫా బాద్‌లో 19.4, చింతలమానేపల్లిలో 18.9, సిర్పూర్‌ (టి)లో 15.8, కౌటాలలో 12.8 కాగజ్‌నగర్‌లో 11.7 వాంకిడిలో 2.9మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బుధవా రం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచి పోవటంతో వాహనదారులు, పాదచా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరటంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో మురుగునీరు కాల్వల్లో పారి రోడ్లపైకి వచ్చింది.

దహెగాం, (ఆంద్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో రైతులు మేలు జరుగుతుండగా, మండల కేంద్రానికి అనుసంధా నంగా ఉన్న పలు అంతర్గత రోడ్లు పూర్తిగా బురదమయంగా మారింది. ప్రధానంగా మండల కేంద్రం నుంచి కోత్మీర్‌కు వెళ్లే డబుల్‌ రోడ్డు బురదమయంగా మారింది. ద్విచక్ర వాహనాలు కూడా పోలేని పరిస్తితి నెలకొంది. గిరివెల్లి సమీపంలోని బీటీ రోడ్డుపై వర్షం నీరు నిలిచింది. దీంతో అవస్థలు పడ్డారు. అలాగే పీపీ రావు ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో నాగమ్మ చెరువులో నీరు పెరుగుతోంది. అలాగే పోడ్షా పెన్‌గంగా వద్ద కూడా నీటి మట్టం కూడా పెరుగుతోంది. ఏకధాటి గా కురుస్తున్న వర్షంతో సిర్పూరు(టి)-మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన పోడ్షా రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో భారీ వాహనాలు బురదలో కూరుకు పోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి.

రెబ్బెన, (ఆంరఽధజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మండలంలోని వాగుల్లో నీటి ప్రవాహనం పెరుగుతోంది. చెరువులు, కుంట ల్లోకి వర్షం నీరు చేరుతుంది. నంబాల అండర్‌ బ్రిడ్జిపై కూడా నీరు ఉదృతంగా ప్రవహించింది.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మండలంలో వ్యాపారం ఏ మాత్రం కొనసాగని పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షంతో వరి, పత్తి పంట రైతులకు ఎంతగానో ఉప యోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడ తెరిపి లేని వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో మండ లంలోని పలు పత్తి నీటమునిగింది. ఈ వర్షం వరి రైతులకు మేలు చేకూరే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయి. మండలంలోని పలు వార్డుల్లో అం తర్గత రోడ్లు పూర్తిగా బురదమయం అయ్యాయి.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలో బుదవా రం ఉదయం నుంచి కురుస్తున్న ముసురువాన పంటలకు ఊపిరి పోసింది. ఏకదాటిగా కురిసిన ముసురువానతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న వాటికి ప్రాణం పోసింది.

Updated Date - Jul 29 , 2026 | 10:54 PM